యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమా. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేయబోతున్నాడు.  

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ సినిమా షూటింగ్ విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ ను ఆగస్ట్ లో మొదలు పెట్టి, ఆ తర్వాత ఆరు నుంచి ఏడు నెలలలో  ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసే ఈ విధంగా చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో పూర్తి చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సినిమా తర్వాత ఎన్టీఆర్, కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్న  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ , ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: