సినిమా ఏదైనా సరే షూటింగ్ అంటే మాత్రం అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. అంతేకాదు ప్రతీ చిన్న విషయం కూడా ఎంతో ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే అలాంటి ఒక విషయమే సినిమాల్లో వాడే దుస్తులు. మరి అలాంటి దుస్తులు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. అయితే సినిమాల్లో వాడే దుస్తుల కోసం దర్శకుడు ఎన్నో ఆలోచనలతో ఉంటాడు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వాటి కోసం తీవ్రంగా ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ దుస్తులు సినిమా షూటింగ్ అయిన తర్వాత ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు. అయితే షూటింగ్ తర్వాత ఆ బట్టలను ఉతికించి ఇస్త్రీ చేసి వాటిని ఆ తర్వాతి సినిమాలకు వాడే వారు.

అలాగే హీరో పక్కన ఉండే పాత్రలకు గాని, లేదంటే చిన్న చిన్న నటులకు వాడే వాళ్ళు. ఇక ఆ తర్వాతి కాలంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ డ్రెస్ లను వేలం పాట వేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ప్రజలలో క్రమంగా ఆ ఆసక్తి తగ్గిపోవడంతో నిర్మాతలలో మళ్ళి ఆలోచన మారింది. అందుకే ఆ దుస్తులను ఇప్పుడు భద్రపరిచి తర్వాతి సినిమాల కోసం వాడటం గాని, లేదా చిన్న చిన్న సినిమాలకు ఉపయోగించడం చేస్తున్నారు. అంతే కాకుండా క్యారెక్టర్ ల పరంగానూ, జూనియర్ ఆర్టిస్టుల పరంగానూ ఇలా సైజుల వారీగా దుస్తులు సరఫరా చేస్తారు. అంతేకాదు వాటిని అద్దెకు ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు.

అయితే కొందరు నటీనటులు మాత్రం షూటింగ్ అయ్యాక ఆ దుస్తులు కావాలని అడిగి తీసుకుంటారు. ఇంకా వాటిని సీరియల్స్ కోసం గాని లేదా...  షార్ట్ ఫిలిమ్స్ కోసం గాని వాడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మాత్రం షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఇక నిర్మాతలకు అయితే వాటిని వృధా చేయడం ఇష్టం లేక.. ఇతర భాషల సినిమాల వాళ్లకు అలా కూడా కాదు అంటే టీవీ కార్యక్రమాలు చేసే వాళ్లకు విక్రయిస్తున్నారు. ఇక స్టార్ హీరోలు కొందరు అయితే ఆ దుస్తులను వాళ్లే తీసుకుని తమ సినిమా జ్ఞాపకంగా కూడా దాచుకునే వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: