ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. బాహుబలి సినిమా తో పాన్ ఇండియన్ హిస్టరీ లోనే చరిత్ర సృష్టించారు రాజమౌళి ఇటీవల. rrr చిత్రంలో మరొక రికార్డు క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే పుష్ప, కేజిఎఫ్ వంటి చిత్రాలు కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను కూడా బాగా అలరించాయి. ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఈ ట్రెండ్ సెట్ చేసారు కమలహాసన్.

ఆయన ప్రధాన పాత్రలో నటించిన మరో చరిత్ర సినిమా చెన్నైలో ఎలాంటి  ఆర్బాటం లేకుండా  విడుదలైనా ఈ సినిమా రెండేళ్లు విజయవంతంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని మరొక సారి గుర్తు చేసుకున్నారు కమలహాసన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లో ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కమలహాసన్ లీడ్ రోల్ పోషించారు.

ఇక సూర్య , విజయ్ సేతుపతి, పాహద్ ఫాజిల్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 3వ తేదీన విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది దాదాపుగా రెండు వారాల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విక్రమ్ చిత్రం సక్సెస్ కావడంతో నిన్నటి రోజున సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలహాసన్.. విక్రమ్ సినిమా ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా వెనుక నిర్మాత మహేంద్ర గారి కృషి చాలానే ఉన్నది. మరొక చరిత్ర సినిమా తనకు స్టార్ స్టేటస్ తెచ్చిందని ఈ విషయంలో నేను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులతో కృతజ్ఞతతో ఉంటానని తెలియజేశారు. విక్రమ్ చిత్రం ఎన్ని రికార్డులు సాధించినా దాని ఘనత కేవలం ప్రేక్షకులకే అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: