దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 25 వ తేదీన థియేటర్ లో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రేయ, సముద్ర కని ముఖ్య పాత్రల్లో నటించారు. 

ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా, ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 1,100 కోట్ల పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ ఆర్ ఆర్ కొన్ని రోజుల క్రితం నుండే మరియు జీ 5, నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం 'ఓ టి టి' లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ను కనబరుస్తుంది.

అందులో భాగంగా తాజాగా జీ 5 లో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది.  జీ 5 'ఓ టి టి' లో  'ఆర్ ఆర్ ఆర్' మూవీ చేస్తున్న సందడి కి సంబంధించి తాజాగా జీ 5 సంస్థ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం ఇప్పటివరకు 'ఆర్ ఆర్ ఆర్' మూవీ  1000 ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ని సాధించినట్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా #1 స్థానంలో కొనసాగుతున్నట్లు , 190 దేశాల్లో వ్యూవర్ షిప్ , జి ఫైవ్ లో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా ఈ మూవీ నిలిచినట్లు సంస్థ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇలా ఇప్పటికి కూడా ఈ సినిమా జోరు  ఫుల్ గా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: