ప్రతి సంవత్సరం ఎన్నో మూవీ ల టీజర్ లు విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన టీజర్ లలో కొన్ని మంచి ప్రేక్షకాదరణ పొందుతూ ఉంటాయి. అలా ప్రేక్షక ఆదరణ బాగా పొందిన సినిమా టీజర్ లకు లైక్ లు కూడా అత్యధికంగా లభిస్తుంటాయి. అయితే విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్ లను సాధించిన 5 తెలుగు సినిమా టీజర్ ల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ లోని రామరాజు ఫర్ బీమ్ టీజర్ విడుదలయిన 24 గంటల్లో 940.3 కే లైక్ లను సాధించింది.


పుష్ప : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ టీజర్ విడుదలైన 24 గంటల్లో 793 కే లైక్ లను సాధించింది.


వఖిల్ సబ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 776.9 కే లైక్ లను సాధించింది.


సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తమన్ సంగీత సారధ్యంలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 754.9 కే లైక్ లను సాధించింది.


ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ లోని గ్లిమ్స్  622.2 కె లైక్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: