సినీ ప్రేమికులు ప్రస్తుతం సినిమా లను 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో చూడడానికి ఏ రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఇండియా లోకి కారోనా  ఎంటర్ కాకా ముందు ఓ టి టి ప్లాట్ ఫామ్ ల హవా అంతగా కనిపించేది కాదు . కాక పోతే ఎప్పు డైతే దేశం లోకి కారోనా ఇంటర్ అయిందో అప్పటి నుండి దేశంలో థియేటర్ లపై, కొన్ని ఆంక్షలను విధించడం , అలాగే కొన్ని రోజుల పాటు పూర్తిగా థియేటర్ లను మూసివేయడంతో సినీ ప్రేమికులకు  ' ఓ టి టి లకు బాగా అలవాటు పడిపోయారు . 

దానితో ప్రస్తుతం కూడా ఎంతో మంది సినీ ప్రేమికులు సినిమా లను 'ఓ టి టి' లో చూస్తూ వస్తున్నారు. ఇలా సినీ ప్రేమికులు చాలా మంది 'ఓ టి టి' లో సినిమాలు చూడడానికి అలవాటు పడడంతో 'ఓ టి టి' సంస్థలు కూడా వారి ముందుకు మంచి మంచి కంటెంట్ ను తీసుకువస్తున్నాయి .  అందులో భాగంగా కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చే స్తున్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జయమ్మ పంచాయతీ సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే .

థియేటర్ లలో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది . ఇలా థియేటర్ లలో  ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయిన జయమ్మ పంచాయతీ సినిమా జూన్ 14 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: