విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ ఈ మూవీ లో  హీరోయిన్ లుగా నటించారు. సోనాల్ చౌహాన్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్, ఆలీ, సునీల్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుండే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు మొదటి వారం రోజుల పాటు వచ్చాయి.  ఆ తర్వాత ఇతర ఎఫ్ 3 మూవీ కి ఇతర సినిమాల నుండి పోటీ ఏర్పడడంతో ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఇప్పటి వరకు 16 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఎఫ్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 17.85 కోట్లు ,
సీడెడ్ : 6 కోట్లు ,
యూ ఎ: 5.86 కోట్లు ,
ఈస్ట్ : 3.34 కోట్లు ,
వెస్ట్ : 2.42 కోట్లు ,
గుంటూర్ : 3.22 కోట్లు ,
కృష్ణ : 2.83 కోట్లు ,
నెల్లూర్ : 1.74 కోట్లు ,
16 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 43.26 కోట్ల షేర్ ,  69.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.96 కోట్లు .
ఓవర్ సీస్ లో : 7.07 కోట్లు .
16 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 53.29 కోట్ల షేర్ , 89.37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: