లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్యమూవీ లో  కీలక పాత్రలలో నటించారు. ఇలా హేమా హేమీలు అయిన నటీనటులు విక్రమ్ మూవీ లో నటించడం, వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న లోకేష్ కనకరాజు ఈ మూవీ కు దర్శకత్వం వహించడంతో ఈమూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉండటం, ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీ కి కూడా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

తమిళ నాడు లో : 110.25 కోట్లు .
తెలుగు రాష్ట్రాలలో : 22.11 కోట్లు .
కర్ణాటక లో  : 16.90 కోట్లు .
కేరళ లో 25.95 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో  6.15 కోట్లు .
ఓవర్ సీస్ లో  90.55 కోట్లు .
9 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ మూవీ 136.30 కోట్ల షేర్ ,  271.91 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ప్రస్తుతం కూడా విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: