ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2కి సిద్ధమవుతున్నాడు. పుష్ప పార్ట్ 1 తో నేషనల్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2ని కూడా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. డైరక్టర్ సుకుమార్ కూడా ఈ విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది. అంచనాలకు మించి ఉండేలా చేయాలనే ఉద్దేశంతోనే షూటింగ్ కి ముందే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట.

అసలు సినిమా పుష్ప పార్ట్ 2లోనే ఉందని అంచనాలు రెట్టింపు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇదిలాఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న దానిపై క్లారిటీ రాలేదు. అసలైతే ఐకాన్ అనే సినిమా చేయాల్సి ఉన్నా అది దాదాపు అటకెక్కేసినట్టే అని చెప్పుకుంటున్నారు. ఇక మరోపక్క కొరటాల శివ సినిమా కూడా హోల్డ్ లో పడ్డదని టాక్. అయితే బన్నీ మాత్రం పుష్ప తర్వాత కొరటాల శివ డైరక్షన్ లోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఆచార్య ఫ్లాప్ తో డీలా పడ్డ కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో చేస్తున్నాడు.

ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తోనే కొరటాల శివ సినిమా ఉంటుందని చెబుతున్నారు. తారక్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న కొరటాల శివ ఆ తర్వాత చేసే బన్నీ సినిమా కూడా నేషనల్ లెవల్ రిలీజ్ ఉంటుందని అర్ధమవుతుంది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినట్టుగా ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, చరణ్ కూడా నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. అదే దారిలో అల్లు అర్జున్ కూడా ఇక మీదట తన సినిమాలన్ని పాన్ ఇండియా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: