న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు దూకుడుగా ఉన్నాడు. ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్ళక  ముందే మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు.మొన్న వచ్చిన అంటే సుందరానికి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది..ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తెలుగులోకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చింది.

 

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు.



 ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాను ‘దసరా’కి రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోవడంతో అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. గత ఏడాది క్రిస్మస్ మనదే అంటూ ‘శ్యామ్ సింగ రాయ్’తో నాని హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రిస్మస్ టార్గెట్ గా వస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు నాని ఫ్యాన్స్..ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం నానికి ఇక సినిమా అవకాశాలకు కొదవ ఉండదు..


మరింత సమాచారం తెలుసుకోండి: