భాషతో సంబంధం లేకుండా..కాస్త విభిన్నమైన కథ ప్రేక్షకులను మైమరపించింది అంటే చాలు తమిళ ప్రజలు మాత్రం ఆ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేయడమే కాకుండా వసూళ్ళ పరంగా కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచి ఉంటుంది. అలాంటి చిత్రమే బాహుబలి. బాహుబలి 2 చిత్రం తమిళంలో ఐదేళ్లుగా ఇదే రికార్డు బాక్స్ ఆఫీస్ లో నెంబర్ వన్ స్థానం లో ఉన్నది. ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డులు ఏ హీరో కూడా కొల్లగొట్ట లేదు. కానీ ఇప్పుడు హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్రేక్ చేయబోతోంది అన్నట్లుగా హాట్ టాపిక్ గా మారుతోంది తమిళం ఇండస్ట్రీలో.


కమలహాసన్ భారతీయ సినిమా లెజెండ్ నటులలో ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వెండితెరపై నటుడిగా తనదైన అసాధారణ ప్రదర్శనలతో కొన్ని షో లకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించడమే కాకుండా 20 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ రికార్డులను సైతం సృష్టించారు. 60 ఏళ్ళ వయస్సులో కూడా కమల్ హాసన్ ఎంతో హుషారుగా నటిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోతున్నారు.


విక్రమ్ సినిమా తమిళనాడులోని 8 రోజులకు రూ. 110 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ గా  లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. బాహుబలి-2 సినిమా వచ్చి ఇప్పటికే 5 ఏళ్ల అవుతోంది.. ఈ  రికార్డు ఎవరు కొట్టలేకపోయారు. దాదాపుగా ఈ చిత్రం తమిళనాడులోనే రూ. 155 కోట్ల రూపాయలను జీవిత కాల కలెక్షన్ గా సంపాదించింది. ఆ తర్వాత విజయ్ నటించిన బిగిల్ చిత్రం రూ.141 కోటి రూపాయలు సంపాదించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక నిన్నటి రోజున విక్రమ్ సినిమా దాదాపుగా రూ.130 కోట్ల రూపాయల మార్క్ ను అందుకునట్టుగా తమిళనాడులో టాక్  వినిపిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం నాల్గవ స్థానంలో ఉన్నది. ఇక నెమ్మదిగా అన్ని రికార్డులను తుడిపీ వేస్తూ తమిళనాడు లో మొదటి స్థానం చేరుకొని అత్యధిక వసూలు చిత్రంగా నిలుస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: