టాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ ఇండియా లోనే భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతుల ను సంపాదించుకుంది నయనతార. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ గా అభివర్ణిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. మినీ సైజ్ హీరోయిన్ కు ఉండే మార్కెట్ ఆమెకు ఉంది. ఆ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. సినిమా పరిశ్రమలో చేసిన సినిమాల ద్వారా ఆమెకు వచ్చిన గుర్తింపు కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన ఎన్నో వివాదాలు ఆమెకు ఇంతటి పాపులారిటీని తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.

ఆమె తాజాగా దర్శకుడు విగ్నేష్ ప్రేమించి పెళ్లి జరిగింది. ఎన్నో రోజుల నుంచి వీరి ప్రేమ కొనసాగగా అయిన తర్వాత ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోవడం ఎంతో సందోహాన్ని ఏర్పరుస్తుంది. గతంలో ఆమె శింబు మరియు ప్రభుదేవా ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. అయితే వారి తో విభేదించి ఇప్పుడు ఈ దర్శకుడి ని పెళ్లి చేసుకోవడం విశేషం. ఏదేమైనా నయనతార తన పాత జీవితాన్ని వదిలేసి ఇప్పుడు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడం ముందడుగు వేయడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.

అయితే సినిమాల పరంగా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా ఎవరికీ తెలియదు. కొంతమందిని పెళ్లి తర్వాత పూర్తిగా దూరమైపోతారు.  అయితే నయన్ సినిమాల్లో నటించినా ఇకపై ఆమె బాగా గ్లామర్ పాత్రలు చేయకూడదని డిసైడ్ అయింది అని ఆమె సన్నిహితుల దగ్గర నుంచి తెలుస్తుంది. పెళ్లి తర్వాత ఎవరు కూడా గ్లామర్ ను బాగా చూపించే పాత్ర చేయడానికి పెద్దగా ఇష్టపడరు ఆ విధంగానే నయనతార కూడా సింపుల్ గా ఉండే పాత్రలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది అని అంటున్నారు. మరి దీనినీ ఆమె అభిమానులు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి. మంచి అందంతో చక్కని అభినయంతో ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన నయనతారకు పెళ్లి తర్వాత ఎంతవరకు పెద్ద సినిమాల అవకాశాలు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: