మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.  రవితేజ కెరీర్ లో ఉన్న హిట్ మూవీ లలో రాజా ది గ్రేట్ సినిమా ఒకటి. టాలీవుడ్ కామెడీ దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మూవీ లో  రవితేజ సరసన మెహరీన్ కథానాయికగా నటించగా,  ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. రాజా ది గ్రేట్ సినిమా కంటే ముందు వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన రవితేజ రాజా ది గ్రేట్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అనుకుంటే ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇలా రవితేజ కెరీర్ లో పవర్ఫుల్ హిట్ గా నిలిచిన రాజా ది గ్రేట్ మూవీ కి దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నట్లు  ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సీక్వెల్ మూవీకి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రాజా ది గ్రేట్ మూవీ సీక్వెల్ లో రవితేజ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించడానికి అనుగుణంగా అనిల్ రావిపూడి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అయితే రాజా ది గ్రేట్ మూవీ లో  రవితేజ తో పాటు ప్రభాస్ ను  నటింప చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సీక్వెల్ మూవీ ని దిల్ రాజు నిర్మించినుండగా ప్రభాస్ ను రాజా ది గ్రేట్ సినిమాలో నటింపజేయడానికి ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: