పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి  మూవీ లలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది .

మధ్యలో కొంత కాలం ఈ సినిమా షూటింగ్ ఆగి పోయింది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. అయితే తాజాగా ఇప్పటి వరకు ఆయన షూటింగ్ కి సంబంధించిన సన్నివేశాలను చూసిన పవన్ కళ్యాణ్ కాస్త డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయవలసిందిగా  సూచించి నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాక పోతే అవుట్ అంతగా బాగా రాకపోవడంతో రీ షూట్ చేయవలసిన అవసరం ఉండటంతో ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావడం కష్టంగానే కనిపిస్తోంది. మరి ఈ సినిమాను  సంక్రాంతికి విడుదల చేస్తారో లేదో చూడాలి.  

సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే తమిళ సినిమా వినోదయ సీతం  రీమేక్ లో నటించడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ తమిళ రీమేక్ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: