లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరైన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా జూన్ 3 వ తేదీన తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.

మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న విక్రమ్ మూవీ ఆ అంచనాలకు తగినట్లు గానే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి తమిళ నాడు లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రమ్ మూవీ ఈ తొమ్మిది రోజుల్లోనే తమిళనాడు లో 121 కోట్ల కలెక్షన్ లను సాధించి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు అయిన బీస్ట్ మరియు కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ల టోటల్ కలెక్షన్ లను దాటి వేసింది.  ఇలా విక్రమ్ సినిమా 9 రోజుల్లోనే బీస్ట్ , కే జి ఎఫ్ చాప్టర్ 2 లాంటి రెండు భారీ పాన్ ఇండియా సినిమాల టోటల్ కలెక్షన్ లను అవలీలగా దాటి వేసింది.

మరి రానున్న రోజుల్లో విక్రమ్ సినిమా ఎ రేంజ్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి. విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య ముఖ్య పాత్రలలో నటించగా ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్మూవీ ని నిర్మించారు. ఈ మూవీ కి యంగ్ సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: