మెగా అభిమానులు ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకు ఉపాసన వారి ప్రియమైన వదిన. ఆ అభిమానానికి తగ్గట్టుగానే ఉపాసన కూడ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ కు సంబంధించిన అన్ని వ్యక్తిగత విషయాలు చరణ్ అభిమానులకు షేర్ చేస్తూ వారితో నిరంతరం టచ్ లో ఉంటుంది.


అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పటల్స్ లో ఎక్కడైనా సరే మెగా అభిమానులకు ఏదైనా ఆరోగ్య విషయంలో సమస్యలు ఏర్పడితే మెగా అభిమానుల కుటుంబ సభ్యులకు కొంత హాస్పటల్ లో డిస్కౌంట్ కూడ ఇప్పిస్తూ అభిమానులకు తనవంతు సేవ చేస్తోంది. ఈరోజు చరణ్ ఉపాసనల 10వ పెళ్ళిరోజు. టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ హ్యాండ్ సమ్ కపుల్ గా పేరుగాంచిన వీరిద్దరూ తరుచూ ఫిలిం ఫంక్షన్స్ కు అదేవిధంగా సెలెబ్రెటీ మ్యారేజ్ ఫంక్షన్స్ కు వస్తే చాలు వీరిద్దరి పైనే మీడియా కెమేరాల ఫోకస్ ఉంటుంది.


వీరిద్దరికీ ఇంకా పిల్లలు పుట్టకపోయినా చరణ్ ఫామ్ హౌస్ లో ఉన్న పెంపుడు జంతువుల సంఖ్యను చూసిన్నప్పుడు తనకు ఒక జ్యు గుర్తుకు వస్తుంది అంటూ చిరంజీవి ఓపెన్ గానే అనేకసార్లు చెప్పాడు. మూగ జీవాల పై వీరిద్దరూ చూపించే ప్రేమ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ గానే ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు వారి 10వ వార్షికోత్సవ వేడుకలను చరణ్ ఉపాసన లు తమకు సన్నిహితులైన 10 మంది స్నేహితులతో కలిసి యూరప్ లో జరుపుకుంటున్నారు.


వీరి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మెగా అభిమాన సంఘాలు కొందరు తెలుగు రాష్ట్రాలలో పేదలకు అన్నదానంతో పాటు కొన్ని అనాధ సరణాలయాలలో సేవా కార్యక్రమాలు కూడ నిర్వహిస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయం తరువాత చరణ్ క్రేజ్ బాలీవుడ్ లో కూడ బాగా పెరగడంతో ఆ క్రేజ్ ను మరింత పెంచడానికి ఉపాసన ఒక స్పెషల్ పిఆర్ టీమ్ ను ముంబాయిలో ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తుంది అని అంటారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: