టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటించిన ‘విరాటపర్వం’ ఈవారం విడుదల కాబోతోంది. గత రెండు వారాలుగా వస్తున్న సినిమాలు అన్నీ వరసపెట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు ఈవారం విడుదల కాబోతున్న ‘విరాటపర్వం’ ఎలాంటి ఫలితాన్ని తీసుకువస్తుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.


నక్సల్ ఉద్యమం నేపధ్యంలో 1980 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని నిర్మించబడ్డ ఈ మూవీ ఎంతవరకు నేటి యూత్ కు కనెక్ట్ అవుతుంది అన్న విషయం పై సందేహాలు ఉన్నాయి. ఈమూవీని ప్రమోట్ చేస్తూ సాయి పల్లవి కొన్ని మీడియా సంస్థలకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయి పల్లవి తన చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో మణిరత్నం ‘అమృత’ సినిమాను చూసి తనకు తన తల్లి తండ్రుల పై ఏర్పడిన ఒక విచిత్రమైన అనుమానాన్ని బయటపెట్టింది.


తన చిన్నతనంలో తాను ఏవిషయాన్ని పూర్తిగా నమ్మకుండా ప్రతి విషయం పైనా అనుమానంతో వ్యవహరించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంది. ‘అమృత’ మూవీ చూసిన తరువాత తన తల్లితండ్రులు తనను కూడ ఎక్కడ నుంచి అయినా తీసుకు వచ్చి దత్తత తీసుకున్నారేమో అన్న సందేహం తనను చాలకాలం వేదించినా విషయాన్ని బయటపెట్టింది. ఈవిషయం పై అప్పట్లో తను తన తల్లితండ్రులను ‘నేను నీకే పుట్టానా’ అంటూ అప్పట్లో తరుచు ప్రశ్నిస్తూ ఉండటంతో తన తల్లితండ్రులు తన పై అసహనం వ్యక్త పరిచిన సందర్భాలను సరదాగా ఇప్పుడు బయటపెట్టింది.


తన చిన్నతనంలో తన ఇంటిలోని పెరట్లో చెట్ల పై వాలిన సీతాకోకచిలుక లను పట్టి వదిలేసిన అనుభూతి తాను ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఏ వస్తువుకోనుకున్నా ఆ వస్తువులో తనకు ఆనందం రావడం లేదు అంటూ కామెంట్స్ చేసింది. లిపి లేని ‘బడగ’ భాష మాట్లాడే తెగకు సంబంధించిన ప్రాంతంలో పుట్టిన సాయి పల్లవి కి ఆపెరును పెట్టింది ఆమె నిరంతరం పూజించే భగవాన్ శ్రీ సత్య సాయిబాబ..


మరింత సమాచారం తెలుసుకోండి: