‘ఆర్ ఆర్ ఆర్’ ఊహించిన స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయలేకపోయినప్పటికి ఆమూవీతో రామ్ చరణ్ మార్కెట్ బాగా పెరిగింది. ఈమూవీలో అల్లూరి పాత్రలో చరణ్ ప్రదర్శించిన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు రావడంతో పాటు సగటు ప్రేక్షకుడులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులలో రామ్ చరణ్ పట్ల మ్యానియా పెరిగింది.


‘ఆర్ ఆర్ ఆర్’విడుదల తరువాత అనేక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అనేకమంది బాలీవుడ్ దర్శకులు చరణ్ తో సినిమాలు తీయడానికి ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ వచ్చిన అవకాశాలు అన్నీ ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కూడ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈమూవీ విడుదల తరువాత బాలీవుడ్ లో చరణ్ మార్కెట్ పై ఒక క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది.


ఇలాంటి పరిస్థితుల మధ్య రామ్ చరణ్ కు అమెరికాలో విపరీతమైన అభిమానులు ఏర్పడటంతో పాటు ఏకంగా కొంతమంది అమెరికన్స్ తమకు చరణ్ పై క్రష్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ‘ఇన్ సైడర్’ కు అమెరికాలో కరస్పాండెంట్ గా పనిచేస్తున్న అక్యున తనకు చరణ్ పై క్రష్ ఉంది అంటూ  ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈమధ్య తాను అమెరికాలో చరణ్ నటించిన  ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ చూశానని ఆమూవీలో అల్లూరి పాత్రలో చరణ్ ను చూసిన దగ్గర నుంచి తనకు చరణ్ పై క్రష్ పెరిగిందని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.


అంతేకాదు చరణ్ హాలీవుడ్ సినిమాలలో నటిస్తే తనకు చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేసింది. ఈకామెంట్స్ ను పరిశీలిస్తే చరణ్ తన ఇమేజ్ ని మరింత ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు బాలీవుడ్ లో లక్షలు ఖర్చుపెట్టి పిఆర్ టీమ్ ను కొనసాగిస్తున్నట్లుగా హాలీవుడ్ లో కూడ తన మ్యానియా పెంచుకోవడానికి అమెరికాలో కూడ ఒక స్పెషల్ పిఆర్ టీమ్ ను లక్షల డాలర్లు ఖర్చుపెట్టి తనకు తాను ప్రమోట్ చేసుకోవాలని అనిపిస్తుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: