ప్రస్తుతం ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపుతున్న విషయం ఏదన్నా ఉంది అంటే అది సినిమాలే.అయితే ప్రస్తుతం మన స్టార్ హీరోలు ఏ సినిమాలు చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మన హీరోల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ల పరిస్థితేంటి..? అనే విషయాలు తెలుసుకోవాలని చూస్తుంటారు.ఇకపోతే  టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ కొత్త సినిమాలపై ఎప్పుడూ సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. అంతేకాదు హడావిడిగా సినిమాలు చేయడం బన్నీకి నచ్చదు.ఇక  కొందరు స్టార్ ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటారు.అంతేకాక సమాంతరంగా సినిమాలు చేస్తుంటారు. 

ఇక ఇంకొందరేమో.. ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమాకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. అయితే బన్నీ మాత్రం ఇలా చేయరు. ఈయన ఒక సినిమాకి, ఇంకో సినిమాకి గ్యాప్ తీసుకుంటారు. అయితే 'నా పేరు సూర్య' విడుదలైన రెండేళ్ల తరువాత 'అల.. వైకుంఠపురములో' సినిమా వచ్చింది.ఇక  ఆ తరువాత 'పుష్ప' సినిమా మొదలుపెట్టడంలో ఆలస్యం జరిగింది. అయితే దీని తరువాత 'పుష్ప2'కి కూడా గ్యాప్ తప్పలేదు. కాగా మధ్యలో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా..మన హీరో బన్నీ మాత్రం చేయలేదు.ఇకపోతే  'పుష్ప2' తరువాత సినిమా మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు.కాగా  ఇటీవల సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ కలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు...

 మొదలయ్యాయి. అయితే ఈ క్రమంలో బన్నీ మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు  బన్నీ చేతిలో 'పుష్ప2' తప్ప మరో సినిమా లేదని అన్నారు.పోగా భన్సాలీకి 'పుష్ప' నచ్చిందని.. ఇక అలానే బన్నీకి 'గంగూబాయి కతియవాడి' నచ్చిందని.. అంతేకాదు....ఈ నేపథ్యంలో ఒకరినొకరు కలవాలనుకున్నారని చెప్పారు బన్నీ వాసు. దీనితోపాటు వారు ఇద్దరూ కుదిరినప్పుడు కలిశారని.. అంతకుమించి వారి కాంబినేషన్ కి ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ఇకపోతే బన్నీ కొత్త సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: