విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న ఈ సినిమా థియేటర్ లలో విడుదలైన మొదటి రోజు మంచి కలెక్షన్లతో పాటు మంచి పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకుంది. అలా ఈ సినిమాకు మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 18 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 18.06 కోట్లు , సీడెడ్ : 6.12 కోట్లు , యూ ఎ : 6.02 కోట్లు , ఈస్ట్ : 3.39 కోట్లు ,  వెస్ట్ : 2.45 కోట్లు , గుంటూర్ : 3.26 కోట్లు , కృష్ణ : 2.87 కోట్లు ,  నెల్లూర్ : 1.75 కోట్లు
18 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 43.92 కోట్ల షేర్ , 70.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3.02 కోట్లు .
ఓవర్ సీస్ లో : 7.11 కోట్లు .


18 రోజుల కాను ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ 54.05 కోట్ల షేర్ , 90.72 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించగా , పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా , ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: