దర్శకధీరుడు రాజమౌళి కి పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి తాజాగా దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఆ క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు .

ఇలా వరుస పెట్టి భారీ సినిమా లతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ వస్తున్న రాజమౌళి మరి కొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కించ బోతున్న విషయం  మన అందరికీ తెలిసిందే . మరి కొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబో తున్నాడు.  ఆఫ్రికన్ జంగిల్ నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతున్నట్టు ఇది వరకే అనేక వార్తలు బయటకు వచ్చాయి . ఇది ఇలా ఉంటే రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోయే మూవీ లో రాజమౌళి ఒక కీలక పాత్రలో ఐశ్వర్యరాయ్ అని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టు పడేస్తూ ఉంటే , మరి కొంత మంది మాత్రం ఒక  వేళ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా ఉన్నట్లు అయితే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది అని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: