లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో  హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్,  సూర్య ముఖ్య పాత్రలో నటించగా , ఈ మూవీ కి తమిళ యంగ్ క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. హేమాహేమీలు అయినా నటీనటులు విక్రమ్ మూవీ లో నటించడం, వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్న లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలా భారీ అంచనాల నడుమ జూన్  3 వ తేదీన తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదల అయిన విక్రమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి పేరు టాక్ ని తెచ్చుకొని ప్రస్తుతం అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు 11 రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న  విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.
 తమిళ నాడు లో: 130.20 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో :  24.21 కోట్లు .
కర్ణాటక లో :  17.55 కోట్లు .
కేరళ లో :  30.90 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7.05 కోట్లు .
ఓవర్ సీస్ లో 100.20 కోట్లు .

 
11 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ మూవీ  (155.05 కోట్ల షేర్ , 310.11 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రేర్ మార్క్ ను చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: