అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చైతు వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు.ఇకపోతే ఫస్ట్ సినిమా తోనే డిజాస్టర్ కొట్టిన చైతన్య సెకండ్ సినిమా నుండి ఫాంలోకి వచ్చాడు.ఇకపోతే నాగచైతన్య కెరీర్ లో హిట్లకంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువ.ఆయన కెరీర్ మొదట్లో చైతన్య తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశాడు.ఇక దాని కారణంగానే ఆయన మంచి మంచి సినిమాలు రిజెక్ట్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే అలా నాగచైతన్య మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను చేతులారా సిల్లీ రీజన్స్ తో వదిలేసుకున్నాడట.ఇక అలా నాగచైతన్య వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏమో ఇప్పుడు చూద్దాం.'

భలే భలే మగాడివోయ్:

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  మూవీ ఇది . అయితే నిజానికి ఈ సినిమా కధ మొదట నాగ చైతన్య దగ్గరకు వెళ్లిందట . అయితే మన  చైతన్య మతిమరుపు ఉన్న అబ్బాయిగా అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకోని భలే భలే మగాడివోయ్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అంతేకాదు సీన్ కట్ చేస్తే నాని నటించిన ఈ  సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.


కొత్త బంగారులోకం:

వరుణ్ సందేశ్ హీరో గా నటించిన సినిమా ఇది.ఇక  ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగ రాసిందో మనకు తెలిసిందే.  ఇకపోతే వరుణ్ కెరీర్ లో హ్యాపీ డేస్ కన్నా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఇదే అని చెప్పొచ్చు.అయితే  ఈ సినిమా కధ ఫస్ట్ చైతన్య కు చెప్పితే..ఆయన కాలేజీ కుర్రాడి గెటప్ లో ఆయన సెట్ అవ్వరని చెప్పి రిజెక్ట్ చేశారట.ఇక  అలా ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు చైతన్య.

అఆ:

నితిన్-సమంత నటించిన  సూపర్ హిట్ సినిమా అ ఆ .అయితే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సమంత అల్లరి..నితిన్ బాధ్యత..మూడు సినిమాను మరో స్దాయిలో నిలబెట్టాయి.ఇకపోతే  ఈ సినిమా మొదట నాగచైతన్య వద్దకే వచ్చింది.కానీ అప్పట్లో వేరే సినిమాతో బిజీ గా ఉన్నాడు చైతన్య....కాగా కాల్ షీట్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇక దాంతో ఈ సినిమా నితిన్ కు వెళ్ళింది.

అయితే  అలా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదుకునేశాడు చైతన్య. ఇక ఈ మూడు సినిమా చేసుంటే చై కెరీర్ మరో లా ఉండేది...!

మరింత సమాచారం తెలుసుకోండి: