ప్రతి సంవత్సరం సౌత్ ఇండియా నుండి ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తూ ఉంటే, మరికొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలుస్తూ ఉంటాయి. అయితే అలా ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుండి విడుదల అయిన సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన 5 సినిమాల గురించి తెలుసుకుందాం.

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అలియా బట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్,  శ్రేయ , సముద్ర కని ప్రధానపాత్రలలో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో డి వి వి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1151.50  కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.


రోబో 2.O : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా 709 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


బాహుబలి : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 605 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.


ఈ 5 సౌత్ ఇండియన్ సినిమాలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: