యూనివర్సల్ స్టార్.. లోకనాయకుడు కమల్ హాసన్ బాక్సాఫీస్ దగ్గర నికార్సైన సక్సెస్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఏ హీరో చేయని ప్రయోగాలు చేస్తూ దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఈఎమధ్య ట్రాక్ తప్పారు. చేయడానికి సినిమాలైతే చేస్తున్నా కూడా అవి కమల్ హాసన్ మార్క్ కు దూరంగా ఉంటూ వచ్చాయి. దశావతారం తర్వాత కమల్ చేసిన ప్రయోగాలన్ని జస్ట్ ఓకే అనిపించాయి. అయితే కమల్ ఫ్యాన్స్ ఆకలే కాదు తన ఆకలి కూడా తీర్చిన సినిమా విక్రం.

యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో కమల్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. కమల్ హాసన్ తో పాటుగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు. విక్రం సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను ఇలా కూడా చేయొచ్చా అని మరోసారి తన డైరక్షన్ టాలెంట్ తో మెప్పించాడు లోకేష్ కనగరాజ్. ఆల్రెడీ అతని టాలెంట్ ఏంటన్నది ఖైదీ సినిమా తోనే అర్ధమైంది.

ఇక ఆ మేనియా కొనసాగిస్తూ విక్రం సినిమా ని అదరగొట్టాడు. విక్రం సినిమా 300 కోట్ల కలక్షన్స్ కు పరుగెడుతుంది. ఈ వసూళ్ల ని చూసి సూపర్ జోష్ లో ఉన్నారు కమల్ హాసన్. ఆడియెన్స్ మైండ్ సెట్ కి నచ్చే సినిమాను ఇస్తే తన సినిమాలు కూడా బాక్సాఫీస్ ని షేక్ ఆడిస్తాయని కమల్ కి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో కమల్ హాసన్ మరుగున పడ్డ అన్ని సినిమాలను తీసి పెడుతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఇండియన్ 2 సినిమాను మళ్లీ తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాడట. అంతేకాదు శభాష్ నాయుడు ని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: