కరోనా లాక్ డౌన్ సమయంలో విడుదలైన ‘వి’ ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో నాని షాక్ కు గురయ్యాడు. దీనితో పూర్తిగా శ్రద్ధ పెట్టి నాని చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ గత సంవత్సరం క్రిస్మస్ కు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆమూవీకి కలక్షన్స్ అంత ఆశాజనకంగా రాలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి.


దీనికికారణం అప్పటికే కేసులు పెరుగుతూ ఉండటంతో గత సంవత్సరం క్రిస్మస్ కు విడుతలైన ఈమూవీ నాని కోరుకున్న ఘన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీనితో నాని ఆశలు అన్నీ ‘అంటే సందరానికి’ మూవీ పై పెట్టుకుని ఆమూవీ కోసం చాల కష్టపడి నటించడమే కాకుండా ఆమూవీని చాల ఎక్కువగా ప్రమోట్ చేసాడు.


డిఫరెంట్ కథ కావడంతో ఆమూవీ తప్పకుండా హిట్ అవుతుందని నాని భావించాడు. అయితే ఈమూవీ విడుదల అయిన తరువాత ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోవడంతో పాటు ఆమూవీ కలక్షన్స్ కూడ ఇంకా మొదటివారం పూర్తికాకుండానే 50 శాతం పైగా తగ్గిపోవడంతో నాని షాక్ లో ఉన్నట్లు టాక్. అంతేకాదు నటించిన సినిమాకు కూడ సరైన ఫలితం రాకపోతే తాను ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అని నాని తన సన్నిహితులతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.


వాస్తవానికి నాని సరైన హిట్ ను అందుకుని మూడు సంవత్సరాలు దాటిపోతోంది. ఇలా వరసపెట్టి పరాజయాలు కొనసాగుతూ ఉంటే నాని కెరియర్ మళ్ళీ కష్టాలలో పడే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో నాని ప్రస్తుతం నటిస్తున్న ‘దసరా’ మూవీ పైనే చాల ఆశలు పెట్టుకున్నాడు. సిగరేణి బొగ్గు కార్మికుల జీవితనేపధ్యంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ ఈ సంవత్సరం దసరా రేసుకు విడుదల అయ్యే ఆస్కారం ఉంది అయితే ఇది పక్కా మాస్ కథ. గతంలో నాని ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ మూవీలో ద్విపాత్రాభినయం చేసి మాస్ లుక్ లో కనిపించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దీనితో ‘దసరా’ మూవీలోని మాస్ లుక్ నానీకి ఎంతవరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: