దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మూవీ 'ఆర్ ఆర్ ఆర్'. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవ్ గన్, శ్రేయ , సముద్ర కని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం , టాలీవుడ్ టాప్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటించడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ మార్చి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొల్ల గొట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అలా థియేటర్ లలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కొన్ని రోజుల క్రితం నుండే 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతున్న అప్పటి నుండి ఈ సినిమాపై హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా హాలీవుడ్ ప్రముఖ రైటర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. హాలీవుడ్ లో ప్రముఖ హిట్ యానిమేషన్ క్యారెక్టర్స్ మినియన్స్ రచయిత బ్రెయిన్ లించ్ వావ్ 'ఆర్ ఆర్ ఆర్' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr