మెగా హీరోలలో చాలామంది ఇప్పుడు అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకరిద్దరు తప్ప మిగతా అందరు మెగా హీరోలు కూడా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అభిమానులను కలిగి ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు డజను మంది మెగా హీరోలు తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతుండగా వారిలో ఒకరైన అల్లు శిరీష్ కి టాలీవుడ్ లో ఏ మాత్రం కలిసి రాకపోవడం మెగా అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది.

అల్లు అరవింద్ తనయుడు గా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా తెలుగు సినిమా పరిశ్రమలోకి పరిచయమైన అల్లు శిరీష్ నటుడిగా సరైన సక్సెస్ లేకపోవడంతో పూర్తిగా వెనుకబడి పోయారు. ఆయన సోదరుడు అల్లు అర్జున్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు. అలాంటి సోదరుడితో కలిసి ఉన్న ఈ హీరో ఎందుకు ఆ స్థాయికి కాకపోయినా మినిమమ్ గ్యారంటీ హీరోగా అయినా ఎదగలేకపోయారు అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.

కారణమేదైనా అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోకపోవడం అల్లు వారి అభిమానులను ఎంతో నిరాశ పరుస్తుంది. ఇప్పటికైనా ఆ హీరో సినిమాల మీద దృష్టి పెడితే తప్పకుండా హీరోగా నిలదొక్కుకుంటాడు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఉండి కూడా ఎంతో మంది పెద్ద దర్శకులను చేతిలో ఉంచుకుని కూడా ఎందుకు అల్లు అరవింద్ అల్లు శిరీష్ ను స్టార్ హీరో చేయడం లేదని కొతమంది విమర్శకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఎంతో మంది యువ హీరోల ను అగ్ర హీరోలుగా మార్చిన అల్లు అరవింద్  శిరీష్ ను ఎందుకు హీరోగా నిలదొక్కుకునేలా చేయలేకపోతున్నాడు అని కూడా అంటున్నారు. మరి ఇప్పటికైనా అల్లు వారి సంస్థ కొత్త హీరోలను ఎదిగేలా చేయడం మానేసి సొంత హీరో ను ఎదిగేలా చేసుకుంటే మంచిది అని వారి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: