యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. నటుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఆయన ఏ స్థాయిలో నటిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి ఆయన నటనను ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆ విధంగా తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవడానికి మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 31 సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

తొలి సినిమా నుంచి తన నటనతో డాన్సులతో ప్రేక్షకులను అలరించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ నందమూరి హీరో. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న హీరో నందమూరి వంశంలో ఎవరూ లేరనే చెప్పాలి. పెద్ద ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ భారీ అభిమానులను కలిగిన హీరో లుగా ఉన్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ కు ఇంత మంది అభిమానులు కలగడానికి కారణం సినిమాలు మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా అని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు.

నందమూరి వారసుడుగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఈ హీరో ఇంతటి పెద్ద హీరోగా ఎదుగుతాడని ఎవరూ కూడా ఊహించలేదు. ఏదేమైనా ఎన్టీఆర్ లాంటి నటుడు దొరకడం తెలుగు సినిమా పరిశ్రమకు ఓ వరం లాంటిదని ఎంతోమంది చెబుతూ వచ్చారు. ఇక కొరటాల శివ తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్టీఆర్.  ఇప్పుడు కుటుంబంతో కలిసి వెకేషన్ లో ఉన్న ఎన్టీఆర్ త్వరలో తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటిదాకా ఆయన నటించిన సినిమాలు భారీ స్థాయిలో అభిమానులను అలరించగా ఇప్పుడు ఏ స్థాయిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: