ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనికికారణం ఈ సమ్మర్ రేస్ కు విడుదల అయిన చాల భారీ సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో చాల సినిమాలు ఫెయిల్యూర్ బాట పడ్డాయి. ‘రాథే శ్యామ్’ ‘ఆచార్య’ బయ్యర్లు తీవ్రంగా నష్టపోతే ‘సర్కారు వారి పాట’ ‘ఎఫ్ 3’ బయ్యర్లు ఆమూవీల ఫలితం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


లేటెస్ట్ గా విడుదల అయిన నాని ‘అంటే సుదరానికి’ కూడ కలక్షన్స్ విషయంలో కూడ వెనకపదతంతో ఈమూవీ బయ్యర్లు కూడ ఇప్పుడు టెన్షన్ పడుతున్నట్లు టాక్. సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గిపోయి కేవలం శుక్రు వారం విడుదలైన సినిమాలకు ఆదివారం వరకు మాత్రమే ధియేటర్లకు వచ్చి చూస్తున్నారు. ఆతరువాత మొదటివారం పూర్తి కాకుండానే ప్రేక్షకులలో నిర్లిప్తత పెరిగి మరో నెలరోజులు ఆగితే ఈసినిమాలు అన్నీ ఓటీటీ లో వచ్చేస్తాయి కదా అన్న అంచనాలతో ప్రేక్షకులు సినిమాలను దూరం పెడుతున్నారు.



హీరోల పారితోషికం విపరీతంగా పెరగడంతో సినిమాల నిర్మాణ వ్యయం బాగా పెరిగి చాల సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడ చాల కష్టంగా మారుతున్నాయి అన్న అంచనాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ‘అంటే సందరానికి’ మూవీ హీరో నానీకి 15 కోట్ల పారితోషికం నిర్మాతలు ఇచ్చారు అంటూ వస్తున్న మాటలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. నాగచైతన్య నితిన్ లాంటి హీరోలు కూడ 10 కోట్లకు పైగా పారితోషికాలు అడుగుతున్నారట.


రవితేజా అయితే 20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ పెరిగిన పారితోషికాలతో ఇప్పుడు నిర్మాతలకు భారీ సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు తీయడం కష్టంగా మారితే చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు ఆ సినిమాలను మొదటిరోజున కూడ చూడటానికి జనం రాకపోవడంతో అసలు ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక దర్శక నిర్మాతలు తల పట్టుకుంటున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: