ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా తెరకెక్కిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకు పోతున్న విషయం మన అందరికీ తెలిసిందే .  చాలా కాలం నుండి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న కమల్ హసన్ కు విక్రమ్ మూవీ అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని తీసుకు వచ్చింది . ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల కు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించి ప్రస్తుతం కూడా అదిరిపోయే హోల్డ్ ను థియేటర్ లలో కనబరుస్తూ ముందుకు సాగుతోంది .

విక్రమ్ మూవీ కి లోకేష్ కనక రాజు దర్శకత్వం వహించగా ఈ మూవీ లో విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య కీలక పాత్ర లలో నటించారు . ఈ మూవీ కి యంగ్ టాలెంటెడ్ సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు . ఇప్పటి వరకు 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

తమిళ నాడు లో 136.80 కోట్లు .
తెలుగు రాష్ట్రాలలో  24.71 కోట్లు .
కర్ణాటక లో 17.80 కోట్లు .
కేరళ లో  31.65 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో  7.40 కోట్లు .
ఓవర్ సీస్ లో  104.65 కోట్లు , (
12 రోజులకు గాను విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 323.01 కోట్ల షేర్ , 161.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది . రాబోయే రోజుల్లో విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తం గా ఇంకా ఎ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: