నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా పోయిన వారం విడుదల అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది. చాలామంది ఈ సినిమా పట్ల సంతృప్తిగా లేరు. బాగా లెన్త్ అయ్యిందని, అనవసరమైన సీన్స్ చాలా ఉన్నాయిఅని కొందరు చెప్పగా వారు చెప్పినట్లుగా ఈ సినిమా ప్రేక్షకులనుంచి కూడా అదే ఫీడ్ బ్యాక్ ను తెచ్చుకుంది. నాని ఇలాంటి తరహా సినిమాలలో గతంలో చాల సార్లు నటించారని ఇందులో కొత్తేమి లేదని అంటున్నారు. ఏదేమైనా నానిసినిమా ని ఎంచుకోవడం నాని అభిమానులను నిరాశపరుస్తుంది.

సినిమా లో నజ్రియా లాంటి హీరోయిన్ నటించినా కూడా ఈ సినిమా కి ఆమె క్రేజ్ ఏమాత్రం ఉపయోగపడలేదు. వాస్తవానికి సాయి పల్లవి కి ఫిదా సినిమా తో ఎలాంటి క్రేజ్ వచ్చిందో అలాంటి క్రేజ్ ఈ సినిమాతో నజ్రియా కి వస్తుంది అనుకున్నారు. అయితే ఆమె పాత్ర వెరైటీగా లేకపోవడం తో ఆమెకు కూడా ఈ సినిమా ద్వారా ఆశించిన పేరు రాలేదు. దాంతో ఈ సినిమా ఈ ఇద్దరికీ పెద్దగా ఉపయోగపడలేకపోయింది. చాలామంది ఈ సినిమా వన్ టైం వచబుల్ అని చెప్పారు. కానీ యూనిట్ మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు.

ముఖ్యంగా దర్శకుడు ఈ సినిమా లెన్త్ పట్ల క్లియర్ గా ఉన్నాడు. ఆ సినిమా కి ఆ లెన్త్ ఉండడం తప్పనిసరి అన్నాడు. అలాఅయితేనే సినిమా అర్థం అవుతుంది అన్నారు. నాని కూడా ఈ సినిమా కి ఇంకా ప్రమోషన్స్ చేయడం సినిమా పట్ల ఆయనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఏదైతేనేం నాని గత సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఎబో యావరేజ్ సినిమా గా మిగిలిపోయింది. ఇకపోతే నాని చేస్తున్న దసరా సినిమాపైనే ఇప్పుడు అందరి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు నాని. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అయినా నానికి బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెడుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: