సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న సినిమాను మరొక హీరోతో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక హీరోను అనుకుని ఆ హీరోకు కథను వినిపించగా, ఆ సమయంలో ఆ హీరోకు ఆ కథ నచ్చక పోవడం వల్లనో,  లేక డేట్లు సర్దుబాటు చేయలేక పోవడం వల్లనో, లేక వేరే ఇతర కారణాల వలన కొంత మంది హీరోలు వదులుకున్న సినిమాలను మరి కొంత మంది హీరోలు చేయడం వాటితో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు ఆయన నాగ చైతన్య కూడా తన కెరీర్ లో మూడు మంచి సినిమాలను వదులుకున్నాడు. ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

కొత్త బంగారులోకం : నాగ చైతన్య 'జోష్' మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే జోష్ సినిమా కంటే ముందు నాగ చైతన్య కొత్త బంగారులోకం సినిమా కథని విని దాదాపుగా ఓకే చేశారు. కాక పోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి నాగ చైతన్య తప్పుకోవడంతో వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.


బలే బలే మగాడివోయ్ : నాగ చైతన్య కొన్ని కారణాల వల్ల బలే బలే మగాడివోయ్ సినిమాకు నో చెప్పడంతో,  ఆ తర్వాత ఈ మూవీ లో నాని హీరోగా నటించాడు. ఈ మూవీ తో నాని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

 
అ ఆ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ సినిమా అవకాశం మొదటగా నాగ చైతన్య కే వచ్చిందట,  కాకపోతే నాగ చైతన్య కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు నో చెప్పడంతో నితిన్ ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: