మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమా తో వెండితెర అరంగేట్రం చేసాడు రామ్ చరణ్.అయితే ఇటీవల విడుదలైన #RRR సినిమా తో తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.... పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాదు..పాన్ వరల్డ్ స్టార్ గా ప్రస్తుతం అవతరించాడు.ఇక అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ గురించి అభిమానులెవ్వరికి తెలియని ఒక్క ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.అయితే అదేమిటి అంటే రామ్ చరణ్ తన చిన్నతనం లో చైల్డ్ ఆర్టిస్టు గా ఒక్క సినిమాలో నటించాడట.

అయితే చిరంజీవి 100 వ సినిమాగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం లో అప్పట్లో లంకేశ్వరుడు అనే సినిమా తెరకెక్కిన సంగతి  తెలిసిందే.ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా లో ఒక సన్నివేశం లో చైల్డ్ ఆర్టిస్టు అవసరమై ఎవరిని తీసుకోవాలి అనే....సందిగ్ధం లో ఉన్నాడట.అయితే ఆ సమయం లో చిరంజీవి గారు సరదాగా మా అబ్బాయి చరణ్ తో ఆ పాత్ర వెయ్యిస్తే ఎలా ఉంటుంది అని దాసరి నారాయణరావు గారిని అడిగారట.ఇకపోతే అద్భుతమైన ఆలోచన అని దాసరి నారాయణరావు ఆ పాత్రలో చరణ్ ని నటింపచేసాడట.

అయితే కానీ ....సినిమా ఫైనల్ ఔట్పుట్ చూస్తున్న సమయం లో ఆ సన్నివేశం ఎందుకో సీన్స్ కి సిన్ అవుతున్నట్టు అనిపించలేదట.ఇక దీనితో రామ్ చరణ్ మీద తీసిన ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్ లో తొలగించేశారట.అయితే అలా రామ్ చరణ్ బాలనటుడిగా నటించిన ఈ సినిమా గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు.ఇదిలావుండగా తాజాగా ఇప్పుడు  చిరంజీవి - రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: