టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలుగా ఎప్పటి నుండి చెలామణి అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇలా ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుండో బాక్సాఫీస్ పోరు నడుస్తూనే ఉంది.అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా ఎప్పటి నుండో పోటీగా సినిమాలు రిలీజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇకపోతే నందమూరి, మెగా ఫ్యామిలీల నుండి సినిమాలు ఒకేసారి వస్తున్నాయి అంటే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య సందడి వాతావరణమే కాకుండా ఘర్షణ వాతావరణం కూడా నెలకొనేది.

ఇదిలావుంటే  గత కొన్నేళ్లుగా ఇరు స్టార్ హీరోలు సైతం పోటీ వద్దనుకుని రాజీతో ఒకరి తర్వాత మరొకరు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు.ఇక  ఫ్యాన్స్ మాత్రం హీరోలు ఎలా ఉన్న కూడా వీరు పోటీపడడం మాత్రం ఆగలేదు.అయితే ఇటీవలే నందమూరి, మెగా హీరోలు కలిసి ట్రిపుల్ ఆర్ సినిమా చేయగా అప్పుడు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని రచ్చ రచ్చ చేసారు.ఇక ఇది పక్కన పెడితే ఇక ఇప్పుడు సీనియర్ హీరోలు మరోసారి పోటీ పడబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.అయితే  చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా బాలయ్య నటిస్తున్న 107వ సినిమా ఒకేసారి రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

కాగా  దసరా రేస్ లో ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయని తాజాగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా, నందమూరి ఫ్యాన్స్ అలర్ట్ అవుతున్నారు.ఇక ఇదే కనుక నిజం అయితే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి ఖాయం.అంతేకాదు  దసరా ఫెస్టివల్ తో పాటు ఫిలిం ఫెస్టివల్ కూడా థియేటర్ల వద్ద చూడవచ్చు. అయితే మరి ఈ దసరా పోటీలో గాడ్ ఫాదర్ గా రాబోతున్న చిరు విన్ అవుతాడా?  లేక లేదంటే బాలయ్య గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా విజేతగా నిలుస్తుందా? అనే విషయంపై చర్చ జరుగుతుంది.ఇకపోతే ..... చూడాలి చాలా కాలం తర్వాత పోటీ పడబోతున్న సీనియర్ హీరోలకు ఈ సినిమాలు ఎలా కలిసి వస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: