కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ విక్రమ్ సినిమా విజయం చాలా మంది హీరోలకు బూస్టప్ ఇచ్చింది. తన కెరీర్ అయిపోయిందనుకుంటున్న సమయంలో రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చారు కమల్ హాసన్.ఇక ఈయన్ని చూసి ఇప్పుడు మిగిలిన సీనియర్ హీరోలకు ఇంకా అలాగే వారి ఫ్యాన్స్‌కు నమ్మకం పెరిగిపోయింది. వయసుతో పనిలేదు.. కంటెంట్ కనుక కరెక్టుగా పడితే రికార్డ్స్ నడుచుకుంటూ వస్తాయంటున్నారు. కమల్ విక్రమ్ సినిమా రూ.300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. 15 ఏళ్లుగా సరైన హిట్ లేని కమల్ హాసన్‌ను చూసి హిట్ కొడితే చాలు అనుకున్నారు అభిమానులు అంతా. అసలు కనీసం ఆ హిట్టైనా కొడతారా లేదా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేవి. కానీ ఇలాంటి సమయంలో విక్రమ్ సినిమాతో కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తున్నారు కమల్ హాసన్. కుర్ర స్టార్ హీరోలని సైతం వెనక్కి నెట్టేస్తున్నాడు.ఈ హిట్ జోష్ మిగిలిన సీనియర్స్‌లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కమల్ సమకాలీకులైన చిరంజీవి ఇంకా రజినీకాంత్ విక్రమ్ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మినిమం రూ.200 కోట్ల సినిమాలు ఇస్తున్నారు.. నిజం చెప్పాలంటే వాళ్ళతో కొన్నేళ్లుగా సీనియర్స్‌ అసలు పోటీ పడలేకపోతున్నారు. అప్పుడప్పుడూ హిట్స్ ఇస్తున్నారు కానీ మరీ కలెక్షన్ల రికార్డులు తిరగరాసేంత విజయాలు మాత్రం అసలు రావట్లేదు. ఒకప్పుడు చిరు, రజినీ, బాలయ్య ఇంకా కమల్.. పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. కానీ ఈ మధ్య అది కూడా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో తాజాగా కమల్  హాసన్ విక్రమ్‌ సినిమాతో కలెక్షన్ల రికార్డులు మొదలుపెట్టారు. దాంతో మిగిలిన సీనియర్లలో కూడా బాగా జోష్ పెరిగింది. తమిళనాట బాహుబలి 2 రికార్డులు కూడా బద్ధలు కొట్టి విక్రమ్ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కుర్ర హీరోలకి సైతం పెద్ద షాక్ ఇస్తున్నారు కమల్ హాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: