వారం వారం పోస్టర్స్ మారుతున్నాయి గానీ, పరిస్థితిలో ఏ మాత్రం తేడా రావడం లేదు. సీనియర్లు, యంగ్‌స్టర్స్ ఎవరూ బాక్సాఫీస్‌ని మెప్పించలేకపోతున్నారు. కొన్ని సినిమాలు హైప్స్‌ క్రియేట్‌ చేయడంలో ఫెయిల్ అవుతోంటే, మరికొన్ని సినిమాలు అంచనాలని మ్యాచ్‌ చేయడంలో ఫ్లాప్‌ అవుతున్నారు. దీంతో బాలీవుడ్‌లో సినిమా సినిమాకి నష్టాలు పెరిగిపోతున్నాయి.

ఎగ్జయిటింగ్‌ రోల్స్‌తో ఆడియన్స్‌ని మెప్పిస్తోన్న రణ్‌వీర్‌ సింగ్ మే 13న 'జయేష్‌బాయ్‌ జోర్దార్' సినిమాతో బరిలో దిగాడు. బ్రూణహత్యల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మేజిక్‌ క్రియేట్ చేయలేకపోయింది. ఫస్ట్‌ డే కేవలం 3 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. రణ్‌వీర్‌ సింగ్‌ కెరీర్‌లో వీక్‌ స్టార్టింగ్‌ సినిమాగా చెత్త రికార్డ్‌ మూట గట్టుకుంది.

అజయ్‌ దేవగణ్‌ డైరెక్టర్‌ కమ్ హీరోగా చేసిన సినిమా 'రన్‌వే 34'. ఈ సినిమా విడుదలకు ముందు అజయ్‌ దేవగణ్‌, సుదీప్‌తో సోషల్ మీడియాలో వార్‌ చేసి సినిమాకి కావల్సినంత ప్రమోషన్ చేశాడు. అయితే అజయ్‌ ఎంత ట్రై చేసినా 'రన్‌వే 34'కి ఫస్ట్‌ డేనే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమాకి సరైన ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. షాహిద్‌ కపూర్‌ 'అర్జున్‌ రెడ్డి'ని 'కభీర్‌ సింగ్‌'గా రీమేక్‌ చేసి సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇక ఈ సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో 'జెర్సీ' సినిమాని రీమేక్ చేశాడు. ఏప్రిల్‌ 22న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. ఒరిజినల్‌ ఫిల్మ్ తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే ఈ రీమేక్‌ తెరకెక్కినా, ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేదు.

టైగర్‌ష్రాఫ్‌ యాక్షన్‌ హీరోగా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండియన్‌ బ్రూస్‌లీ, ఇండియన్‌ జాకీచాన్‌ అనిపించుకోవాలని రిస్కీ స్టంట్స్‌ కూడా చేస్తున్నాడు. అయితే హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీగా వచ్చిన 'హీరోపంతి2' మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర మినిమం కాంపిటీషన్‌ కూడా ఇవ్వలేకపోయింది. జాన్‌ అబ్రహం సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఎంత సైలెంట్‌గా వచ్చి వెళ్లిపోతుంటాయో, ఈ హీరో కూడా అంతే సైలెంట్‌గా ఉంటాడనే పేరుంది. అయితే 'ఎటాక్-1'ని ప్రమోట్‌ చేయడానికి సౌత్ ఇండస్ట్రీస్‌పైనా, తెలుగు సినిమాలపైనా కామెంట్‌ చేశాడు. కానీ ఈ కాంట్రవర్శీస్‌ కూడా 'ఎటాక్-1'ని కాపాడలేకపోయాయి. అక్షయ్‌ కుమార్‌కి బాక్సాఫీస్‌ దగ్గర మినిమం గ్యారెంటీ అనే ఇమేజ్‌ ఉంది. అయితే ఈ ఏడాది వచ్చిన 'బచ్చన్‌పాండే' ఈ ఇమేజ్‌ని చెడగొట్టింది. తమిళనాట హిట్ అయిన సినిమాని కూడా కరెక్ట్‌గా రీమేక్‌ చేయలేకపోయాడనే విమర్శలు తీసుకొచ్చింది. 'జిగర్తాండ' రీమేక్‌గా వచ్చిన 'బచ్చన్‌ పాండే' డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: