ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడుతున్న మాట ఫుట్ ఫాల్స్. ఫుట్ ఫాల్స్ అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యాక మొదటి షో నుండి ఇక సినిమా థియేటర్ నుండి వెళ్ళే చివరి ఎండింగ్ షో వరకు వచ్చే మొత్తం ప్రేక్షకుల సంఖ్య అన్నమాట. ఇదంతా సినిమా కలెక్షన్స్ క్రేజ్ కి సంబంధించినది.
సినిమా ఎంత కలెక్షన్లు రాబట్టింది ? అన్నది దానిపై ఎక్కువగా చర్చ జరుగుతుండగా ఇపుడు ఫుట్ ఫాల్స్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమా స్టార్ట్ అయ్యాక ఆ సినిమాకి సంబందించిన ప్రతి అంశం యూ ట్యూబ్ వ్యూస్ దగ్గర్నుంచి, థియేటర్ ని వీడే సినిమా చివరి రోజు వరకు చుట్టూ రికార్డుల లెక్కలేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇదే ఫుట్ ఫాల్స్ అంశం చుట్టూ ఆయా సినిమాల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.. రికార్డుల కౌంట్ ఇపుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అభిమానులు కూడా తమ తమ హీరోల సినిమాల లెక్కల చిత్రాలు తెలుసుకుని కాలర్లు ఎగరేయాలి అని తహతహ పడుతుంటారు. ఇదంతా పక్కన పెడితే...  ఈ కోలాహలం నడుమ  తాజాగా 'విక్రమ్' సినిమా హైలెట్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'విక్రమ్' ఇటీవల సంచలన విజయాన్ని అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.  ఇదే క్రమంలో విక్రమ్ సినిమా ఫుట్ ఫాల్స్.. జోరు మామూలుగా లేదుగా.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫుట్ ఫాల్స్ వివరాలు ఇపుడు వైరల్ గా మారాయి. 'బాహుబలి2' సినిమాతో పోలుస్తూ లెక్కలు వేసేస్తున్నారు. బాహుబలి చిత్రానికి తమిళ్ ఇండస్ట్రీలో 17 మిలియన్ ఫుట్ ఫాల్స్ రాగా, 'విక్రమ్' సినిమా ఇప్పటికే 10 మిలియన్ ఫుట్ ఫాల్స్ గ్రాస్ ను దాటేసింది . అయితే బాహుబలి సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడం కష్టమే... కానీ దగ్గరదగ్గర చేరుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఒక సీనియర్ మోస్ట్ హీరో చిత్రం ఈ రేంజ్ లో ఫలితాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదే ఒక పెద్ద రికార్డు. ఈ లెక్కన చేసుకుంటే బాహుబలి సిఎంమా రికార్డులను దాటే సత్తా ఏ తమిళ సినిమాకు లేదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: