టాలీవుడ్ స్టార్ హీరోలలో నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ అభిమానుల మధ్య చాలా సంవత్సరాల నుంచి కూడా జరుగుతోంది. రికార్డులు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ ని బట్టి సోషల్ మీడియాలో ఎప్పుడు ఫ్యాన్స్ మధ్య వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని అందరికి తెలిసిందే.తాజాగా ఆర్మాక్స్ మీడియా మే నెల సర్వే ఫలితాలను ప్రకటించగా ఇక ఈ సర్వేలో ప్రభాస్ నంబర్ 1 హీరోగా నిలిచారు.మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ లిస్ట్ లో తొలి స్థానం ప్రభాస్ కు దక్కడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా సంతోషిస్తున్నారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉండటంతో ప్రభాస్ కు ఈ రికార్డ్ దక్కింది. ప్రభాస్ తర్వాత స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. గత నెలలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ రెండో స్థానంలో నిలవడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రభాస్ ఇంకా మహేష్ తర్వాత స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక 3వ స్థానంలో నిలిచారు.అలాగే స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద మంచి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఇక ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో నాని ఏడవ స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నిలిచారు. చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా ఇంకా రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. తమ ఫేవరెట్ హీరోలు వరుస విజయాలను సాధిస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఇక ఎంతగానో సంతోషిస్తున్నారు. నిజానికి మహేష్ బాబుకి పాన్ ఇండియా సినిమాలు ఏమీ లేకపోయినా నెంబర్ 2 స్థానంలో నిలవడం విశేషం. ప్రభాస్ కి ఎలాగో ఈమధ్య పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇంకా అల్లు అర్జున్ పుష్పతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నారు.కానీ మహేష్ కి కేవలం రీజనల్ సినిమాలతోనే ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా టాలీవుడ్ నెంబర్ 1 హీరో మహేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: