తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఆకాశమే నీ హద్దురా. ప్రతి సామాన్యుడికి విమానం ఎక్కాల  కలను నిజం చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరలతో విమాన టిక్కెట్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి సంచలనం సృష్టించిన దక్కన్ ఎయిర్  సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించి సూర్యాకు మంచి బూస్ట్ ఇచ్చింది.


 అయితే ఇటీవలి కాలంలో ఇతర భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురా సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సూర్య నటించిన గోపీనాథ్ పాత్రలో బాలీవుడ్ కిలాడీ  అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను త్వరలో పట్టా లెక్కించేందుకు అన్నిరకాల సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఆకాశమే నీ హద్దురా సినిమాలో సూర్య హీరోగా నటించాడు అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ ఉండగా.. ఇక నిర్మాతలుగా జ్యోతిగా సూర్య వ్యవహరిస్తున్నారు.  అంతేకాదండోయ్ ఇందులో గెస్ట్ రోల్ లో సూర్యా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తాను నటించిన సినిమాను తానే రీమేక్ చేసి ఇక తానే గెస్ట్ గా నటించడం కేవలం సూర్య మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. అంతేకాదు ఇక బాలీవుడ్లో రీమేక్ అవుతున్న  సినిమాకి కూడా అటు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: