తెలుగు సినిమాల హీరోయిన్స్ లిస్టులో సాయి పల్లవి ది విభిన్నమైన వ్యక్తిత్వం. ఆమె నటించే సినిమాలలో టాప్ యంగ్ హీరోలు ఉండాలి అన్న నిబంధన ఆమె పెట్టుకోదు. అవకాశాలు వస్తున్నప్పుడే వరసపెట్టి సినిమాలు చేస్తూ కోట్లాది రూపాయలు అడ్వాన్స్ లుగా తన దగ్గర ఉంచాలని అనుకోదు. ఆమెకు నచ్చిన కథ అయితేనే ఆమె ఆ పాత్రలను ఎంచుకుంటుంది.


దీనికితోడు ఆమె ఒక్కసారి నటిస్తూ సీన్ లోకి దిగింది అంటే ఆమె ముందు అనుభవం ఉన్న హీరోలు కూడ ఆమెతో పోటీ పడటం కష్టం. ఈ విషయాన్ని స్వయంగా నాని శర్వానంద్ అనేక సార్లు చెప్పారు. ‘విరాటపర్వం’ సినిమాను ప్రమోట్ చేస్తూ రానా ఈమూవీలో తాను హీరో కాదని సాయి పల్లవి మాత్రమే హీరో అని చెప్పాడు అంటే సాయి పల్లవి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.


ఇలాంటి సాయి పల్లవి ‘విరాటపర్వం’ తరువాత చేస్తున్న ఒక్క తెలుగు సినిమా కూడ లేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఈమెకు అవకాశాలు రావడంలేదా లేకుంటే తన దగ్గరకు వచ్చిన కథలు నచ్చక సాయి పల్లవి అన్ని ఆఫర్స్ ను రిజట్ చేస్తోందా అన్నసందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘గార్గి’ అన్న మూవీతో పాటు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో మరో సినిమా చేస్తోంది.


దీనితో ప్రస్తుతం ఈమె డేట్స్ అన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ‘విరాటపర్వం’ మూవీకి మంచి ప్రశంసలు రావచ్చు కాని ఆసినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాల తక్కువ అన్న అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఫలితాన్ని బట్టి సాయి పల్లవి క్రేజ్ పెరగడం కాని తగ్గడం కాని ఉండదు. సినిమాలలో అవకాశాలు ఎప్పుడు తగ్గిపోయినా తాను ఏమాత్రం బాధ పడకుండా వెంటనే తన మెడిసెన్ పూర్తి చేసి హాస్పటల్ పెట్టుకుంటాను అని చెపుతున్న సాయి పల్లవి మాటలలోని ఆత్మస్తైర్యం చాలమంది హీరోయిన్స్ లో పెద్దగా కనిపించదు..


మరింత సమాచారం తెలుసుకోండి: