‘రాథే శ్యామ్’ ఫ్లాప్ తో ప్రభాస్ కెరియర్ మరింత కష్టాలలో పడింది. దీనితో ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ ‘సలార్’ సినిమాలతో పాటు దీపికా పదుకొనే తో కలిసి నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీ కూడ ప్రభాస్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ప్రభాస్ మరో కొత్త సినిమాను ఒప్పుకోకుండా ఈమూడు సినిమాలను హ్యాట్రిక్ హిట్స్ గా మార్చి తన ఇమేజ్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.


ప్రభాస్ దీపిక తో కలిసి నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు అని చెపుతున్నారు. కొంతవరకు బాలకృష్ణ నటించిన ‘ఆదిత్యా 369’ ఛాయలు ఈ మూవీ పై ఉండబోతున్నాయి.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రభాస్ దీపిక లపై కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్న దీపిక కు ఒక్కసారి అనారోగ్యం చేయడంతో ఆమెను వెంటనే దగ్గరలోని కార్పోరేట్ హాస్పటల్ లో చేర్పించినట్లు తెలుస్తోంది. మొదట్లో కేవలం గ్యాస్టిక్ సమస్య మాత్రమే అనుకున్నప్పటికీ ఆమెకు డాక్టర్లు చేసిన కొన్ని టెస్ట్ లలో కొన్ని అనుకోని సమస్యలు బయటపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


వాస్తవానికి ఈ వార్తల పై అధికారికంగా క్లారిటీ లేకపోయినప్పటికీ దీపిక కు కొంత అనారోగ్యం చేసింది అని మాత్రం లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ కు బ్రేక్స్ పడినట్లు తెలుస్తోంది. తిరిగి దీపిక బొంబాయి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈమూవీ షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుంది అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభాస్ కు నడుస్తున్న కాలం ఏమాత్రం బాగాలేదు అని అనిపిస్తోంది..






మరింత సమాచారం తెలుసుకోండి: