రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.ఈమె అందరికి సుపరిచితమే.ప్రస్తుతం ప్రేక్షకుల్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది.ఇక  ఉపాసన సినిమాలలో నటించకపోయినా తను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.అయితే తాజాగా చరణ్ ఉపాసన పెళ్లిరోజు సందర్భంగా ఇటలీకి వెకేషన్ కు వెళ్లారనే సంగతి తెలిసిందే. ఇకపోతే వెకేషన్ లో దిగిన ఫోటోలను చరణ్, ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక అసలు విషయం ఏమిటంటే ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు తెలిసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.

 అయితే ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా 2,23,049 రూపాయలు అని సమాచారం అందుతోంది.ఇక  గ్రీన్ కలర్ సిల్క్ డ్రెస్ లో ఉపాసన చాలా అందంగా కనిపించారు.ఇకపోతే  2012 సంవత్సరం జూన్ 14వ తేదీన చరణ్ ఉపాసనల వివాహం జరిగింది.అయితే  పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న సెలబ్రిటీ జోడీలలో చరణ్ ఉపాసన జోడీ ఒకటని చెప్పవచ్చు.అంతేకాక చరణ్ ఉపాసన ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీలో తమ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ శంకర్ సినిమాతో ఈ సినిమాను మించిన సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.

అయితే ఇటలీలో అందమైన ప్రదేశాలలో చరణ్ ఉపాసన కలిసి ఫోటోలు దిగి ఆ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఉపాసన డ్రెస్సె కాదు రామ్ చరణ్ ధరించిన డ్రెస్ ఖరీదు 1,13,000 రూపాయలు అని సమాచారం.ఇదిలావుండగా చరణ్ మళ్లీరావా, జెర్సీ సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపోతే గౌతమ్ చరణ్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారని పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక స్టార్ డైరెక్టర్లతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్లకు చరణ్ అవకాశాలను ఇస్తున్నారు.కాగా  చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: