అక్కినేని హీరో సుమంత్.. తాజాగా మళ్ళీ మొదలైంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న అహం రీబూట్.. డైరెక్టర్ ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్ ఒరిజినల్ సంయుక్త నిర్మాణంలో.. నిర్మాతలు రఘువీర్ గొరిపర్తి.. సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ను  హీరో అడవి శేషు ట్విట్టర్ వేదికగా విడుదల చేయడం జరిగింది.. ఇక కాన్సెప్ట్ ను తెలుసుకొన్న అడవి శేషు.. టీమ్ ని కూడా అభినందించారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉండగా ఈ చిత్రం జూలైలో విడుదలకు సిద్ధం కానున్నట్లు సమాచారం.

ఇకపోతే మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి అని ఒక రేడియో సృష్టికర్త అయిన మార్కొని చెప్పిన కొటేషన్ తో ఈ ఫస్ట్ గ్లింప్ మొదలవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో సుమంత్ ఆర్ జే నిలయ్ పాత్రలో మనకు కనిపిస్తారు. ఇక  నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి..హీరో కి ఫోన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు హీరోకి ఫోన్ చేస్తూ కాపాడమని అడుగుతారు. మరికొంతమంది రేడియో ద్వారా కోరుతూ ఉంటారు. మరి అతను ఎలా కాపాడాడు అనేది కథాంశంతో తెరకెక్కనుంది. ఇక ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పవచ్చు యూనిక్ కాన్సెప్ట్ ను థ్రిల్లింగ్ గా ప్రెజెంట్ చేయడం అహం రీబూట్ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది అని టీం నమ్ముతోంది.

ఇక సుమంత్ నటన ఈ సినిమాకి ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: