అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.నాగచైతన్య హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఈయన.కాగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.ఇక ఈ విధంగా వీరిద్దరు విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఎవరి కెరీర్ గురించి వారు ఎంతో బిజీగా ఉన్నారు.అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందుకున్నారు.

ఇదిలావుండగా నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాశి ఖన్నా సరసన థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పనులలో జరుపుకొని వచ్చే నెల విడుదల కాబోతుంది.అంతకాక అదే విధంగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మొట్టమొదటిసారిగా అమెజాన్ కోసం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా  నాగచైతన్య సరసన బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రలో నటించారు.ఇకపోతే ఇప్పటికే ఈ వెబ్ సైట్ లిస్ట్ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. నాగార్జున హీరోయిన్ ప్రాచీ దేశాయ్, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి ట్రీట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలోనే వీరిద్దరితో కలిసి దిగిన ఫోటోని ప్రాచీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆమె ఫోటోని షేర్ చేస్తూ నాగచైతన్యతో కలిసి నటించడం వల్ల కొన్ని తెలుగు లైన్లను నేర్చుకోవడంతో పాటు ఎంతో రుచి కరమైన ఏషియన్ ఫుడ్ టేస్ట్ కూడా చేశానని చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈ క్రమంలోనే నాగచైతన్యతో పాటు దర్శకుడుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అయితే  ఈ విధంగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో పై ఎంతోమంది స్పందిస్తూ హీరోయిన్ తో నాగచైతన్య చనువుగా ఉండడంతో పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.అంతేకాదు త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో నాగచైతన్య నెగిటివ్ పాత్రలో సందడి చేయనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: