ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్ లలో శ్రీ లీల ఒకరు. శ్రీ లీల 'పెళ్లి సందD' మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో శ్రీ లీల తన అందచందాలతో,  డాన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలా మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే శ్రీ లీల అనేక సినిమాలను లైన్ లో కూడా పెట్టింది.  ప్రస్తుతం శ్రీ లీల నటిస్తున్న... నటించబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నితిన్ , వక్కంతం వంశీ  కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో శ్రీ లీల ఇప్పటికే హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.

నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కబోయే అనగనగా ఒక రాజు ఆ సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది. బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. వారాహి చలన చిత్రం తెలుగు మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది. ఇలా వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ శ్రీ లీల ముందుకు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: