విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా తమన్నా, మెహరీన్ ఈ మూవీలో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించగా, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా, ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఎఫ్ 3 మూవీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచి మంచి టాక్ ను తెచ్చుకొని మంచి కలెక్షన్లను రా బడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 20 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 18.15 కోట్లు , సీడెడ్ : 6.16 కోట్లు , యూ ఎ : 6.10 కోట్లు , ఈస్ట్ : 3.41 కోట్లు , వెస్ట్ : 2.46 కోట్లు , గుంటూర్ : 3.28 కోట్లు , కృష్ణ : 2.89 కోట్లు , నెల్లూర్ : 1.75 కోట్లు ,
20 రోజులకు గాను రెండు  తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మూవీ 44.20 కోట్ల షేర్ , 71.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3.03 కోట్లు .
ఓవర్ సీస్ లో : 7.12 కోట్లు .


20 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 54.35 కోట్ల షేర్ , 91.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: