టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి మూవీ ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..నాని నుండి చాలా కాలం తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా పై ఆయన అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు..అయితే కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అలరించినప్పటికీ కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండే ఈ సినిమా నిరాశ పరుస్తూ వచ్చింది..సాధారణంగా మన టాలీవుడ్ లో రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్స్ కి మంచి డిమాండ్ అనేది ఉంటుంది..ఈ జానర్ లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజిలో అద్భుతాలు సృష్టించాయి..అంటే సుందరానికి సినిమా కూడా అదే రేంజ్ లో ఆడుతుంది అని అందరూ కూడా అనుకున్నారు..టీజర్, ట్రైలర్ లు కూడా అదిరిపోవడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే అదిరిపోయింది..కానీ మొదటి వీకెండ్ మినహా ఈ సినిమాకి ఇప్పటి వరుకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ రేంజ్ వసూళ్లను నమోదు చేసుకుంటుంది.


ఇక మొదటి రోజు కేవలం 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు ఇంకా అలాగే మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది..కానీ నాల్గవ రోజు నుండి ఈ సినిమాకి ప్రతి చోట  కూడా కలెక్షన్లు అతి దారుణం గా పడిపోయాయి..ఒక్క బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయిలో దారుణమైన వసూళ్లు రావడం అనేది అసలు తెలుగు సినిమా హిస్టరీ లో ఇదే తొలిసారి..అలాగే ఈ సినిమాని బయ్యర్లు అన్ని ప్రాతాలకు కలిపి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు..ఇప్పుడు ఫుల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా 50 శాతం కి పైగా నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..ఈ సినిమా బాగున్నా కూడా వసూళ్లు ఎందుకు ఆ స్థాయిలో రావడం లేదు అంటే కచ్చితంగా OTT ప్రభావం ఉందని ట్రేడ్ సినిమా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.పైగా సినిమా టికెట్ రేట్లు ఎక్కువ అవ్వడంతో జనాలు ఓటీటిలో చూడొచ్చులే అని లైట్ తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: