ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతాఇంతా కాదు. పుష్ప ది రైజ్ సక్సెస్ తో బాలీవుడ్ లో కూడా బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందట..


బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ పైన దృష్టి పెట్టారు. త్వరలో పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని అయితే సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


అయితే పుష్ప ది రూల్ తర్వాత బన్నీ నటించే ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత మాత్రం లేదు. సోషల్ మీడియా, వెబ్ మీడియాలో మాత్రం బన్నీ లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని వార్తలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. విక్రమ్ సినిమాతో లోకేశ్ కనకరాజ్ పేరు సౌత్ ఇండియా అంతటా తెగ మారుమ్రోగుతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా లోకేశ్ కనకరాజ్ గుర్తింపును సంపాదించుకున్నారు.


 


లోకేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మా నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాలు కూడా సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అయితే అందించాయి. బన్నీ లోకేశ్ కాంబోలో మూవీ అధికారికంగా ఫిక్స్ అయితే ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటం గ్యారంటీ అని చెప్పవచ్చు. త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ సినిమా ద్వారా కమల్ హాసన్ కు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయట..


 


కమల్ కు గత సినిమాల ద్వారా వచ్చిన నష్టాలు సైతం ఈ సినిమా ద్వారానే భర్తీ అయ్యాయి. బన్నీ లోకేశ్ కాంబోలో సినిమా ఫిక్స్ అయితే ఈ సినిమాకు నిర్మాతలుగా ఎవరు వ్యవహరిస్తారో మరి తెలియాల్సి ఉంది. బన్నీ ప్రస్తుతం కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీకి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు బన్నీకి క్రేజ్ పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: