టాప్ హీరో సినిమాల సమ్మర్ రేస్ ముగిసింది. ఇప్పుడు నడుస్తున్న ఈ రెయినీ సీజన్ అంతా మీడియం రేంజ్ చిన్నసినిమాల వార్ కొనసాగుతోంది, మళ్ళీ భారీ సినిమాల హంగామా దసరా సమయానికి మొదలుకాబోతోంది. ఇప్పటి నుంచే దసరా రేస్ కు రాబోయే సినిమాల పై అంచనాలు ప్రారంభం అయ్యాయి.


ఈసారి దసరా రేస్ చిరంజీవి బాలకృష్ణల మధ్య వార్ గా మారబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. చిరంజీవి నటించిన ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయినప్పటికీ ఈమూవీని దసరా రేస్ కు విడుదలచేయమని చిరంజీవి ఈమూవీ నిర్మాతలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆసమయానికి సగటు ప్రేక్షకుడు ముఖ్యంగా మెగా అభిమానులు ‘ఆచార్య’ సినిమా గురించి మరిచిపోతారు కాబట్టి ఆనెగిటివ్ ఫీలింగ్ నుండి బయటపడి తన ‘గాడ్ ఫాదర్’ కు మంచి క్రేజ్ తెచ్చుకోవచ్చని చిరంజీవి వ్యూహం అంటున్నారు.


అయితే ఇదే దసరా రేస్ పై బాలకృష్ణ ఇప్పటికే కన్ను వేసాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ కూడ దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ కు వచ్చిన విపరీతమైన స్పందనతో ఈమూవీతో బాలయ్యకు మరొక హిట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో బాలకృష్ణ చిరంజీవిలు సంక్రాంతి వార్ లో ఒకరి పై ఒకరు పోటీపడిన సందర్భాలు చాల ఉన్నాయి.



అలాంటి వార్ లో కొన్నిసార్లు బాలకృష్ణ విజయం సాధిస్తే మరికొన్నిసార్లు చిరంజీవి విజయం సాధించాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ సంక్రాంతికి కాకుండా దసరాకు పోటీ పడటం అత్యంత ఆశ్చర్యంగా ఉంది. సంక్రాంతితో పోల్చుకుంటే దసరా సినిమా వాళ్ళకు చిన్న పండుగ. దీనితో దసరానాడు ఒకేసారి రెండు భారీ సినిమాలు విడుదలయ్యే పరిస్థితులు ఉండవు. అందువల్ల వీరిద్దరిలో ఒకరు దేవి నవరాత్రులు ప్రారంభంలో వస్తే మరొకరు విజయదశమి రోజున రావలసి ఉంటుంది. అయితే అప్పటికి కరోనా ఫోర్త్ వేవ్ తారా స్థాయిలో ఉంటే బాలయ్య చిరంజీవిలు వెనకడుగు వేసే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: